ఎస్సీ కార్పొరేషన్‌ను ప్రక్షాళన చేయాలి

ABN , First Publish Date - 2020-03-02T11:08:30+05:30 IST

ఎస్సీ కార్పొరేషన్‌ను ప్రక్షాళన చేయాలి

ఎస్సీ కార్పొరేషన్‌ను ప్రక్షాళన చేయాలి

మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు శరత్‌బాబు


నెల్లూరు(సాంస్కృతికం) మార్చి 1 : పీకలదాక అవినీతి ఊబిలో కూరుకుపోయిన ఎస్సీ కార్పొరేషన్‌ను సమూలంగా ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నవ్యాంధ్ర రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షుడు కుర్రపాటి శరత్‌బాబు డిమాండ్‌ చేశారు. ఆదివారం నెల్లూరు ప్రెస్‌క్లబ్‌లో జిల్లా నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. కేంద్ర  ప్రభుత్వ పథకాలైన ఎస్‌ఎ్‌సఎ్‌ఫడీసీ, ఎంఎ్‌సకేఎ్‌ఫడీసీ 208-19 యాక్షన్‌లను అప్పటి ఈడీ శ్రావణ్‌కుమార్‌, ఏపీవో పి.సుబ్రహ్మణ్యం అమ్ముకున్నారని ఆరోపించారు. నిజమైన నిరుద్యోగ యువతకు దక్కకుండా ఉద్యోగులకే పథకాలు కట్టబెట్టారన్నారు. పదో తరగతి చదవకుండానే నకిలీ ధ్రువీకరణలు సమర్పించిన వారికి రుణాలు ఇచ్చారని తెలిపారు. దళిత నాయకులమని చెప్పుకేనే వారితో పైరవీలు చేయించుకొన్న వారికి, రౌడీయిజం చేసినవారికి మాత్రమే ౅రుణాలు అందజేశారని తెలిపారు. నెల్లూరు ఎస్సీ కార్పొరేషన్‌లో 1944 నుంచి మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. ఒక్క మాదిగ కులానికి అన్ని పథకాలను అధికారులు దోచిపెడుతున్నారని ఆరోపించారు. డోలు కళాకారులుగా మాలలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారని, వారికి ఉపకరణాలు ఎస్సీ కార్పొరేషన్‌ ఇవ్వడంలేదన్నారు. ఎన్‌ఎ్‌సఎ్‌ఫడీసీ అండ్‌ ఎన్‌ఎ్‌సకేఎ్‌ఫడీసీ 2019-2020 యాక్షన్‌ ప్లాన్‌ను తక్షణమే బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పింఛన్లు, రాయితీ పథకాలు అందజేయాలని కోరారు. మాజీ ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ, ఏపీవోలపై విజిలెన్స్‌ దర్యాప్తు జరిపిస్తే అవినీతి బాగోతం బయటపడుతుందని వారన్నారు. టీడీపీ హయాంలో విడవలూరు, ఊటుకూరు గ్రామంలో రూ.లక్ష కూడా విలువ చేయని భూమిని అప్పటి ఎస్సీ కార్పొరేషన్‌లో పనిచేసిన ఈడీ, తదితరులు రూ.9.50లక్షలకు కొనుగోలు చేశారని దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు కొప్పోలు చంద్రశేఖర్‌, మోచర్ల సాయి, స్వర్ణా రాము, కర్లపూడి సుబ్రహ్మణ్యం, ఎన్‌.శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-03-02T11:08:30+05:30 IST