ఆ బాలుడికి 30.39 ఎకరాలు ఉందట!

ABN , First Publish Date - 2020-03-02T11:05:15+05:30 IST

ఆ బాలుడికి 30.39 ఎకరాలు ఉందట!

ఆ బాలుడికి 30.39 ఎకరాలు ఉందట!

కొత్తవంగల్లులో చిత్రం

అమ్మఒడి కోల్పోయిన వైనం


కొడవలూరు, మార్చి 1: రెక్కడితేకాని డొక్కాడని కుటుంబం. తండ్రి ఆటో డ్రైవర్‌.. రోజూ ఆటో నడిపితే కాని పూట గడవని పరిస్థితి. సెంటు భూమి కూడా లేని ఆటోడ్రైవర్‌ కొడుకును రెక్కల కష్టంపై ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నాడు. అయితే తన కొడుకుకు ఏకంగా 30.39 సెంట్లు భూమి ఉన్నట్లు అధికారులు చూపడంతో అమ్మఒడి కోల్పోయాడు. ఈ ఘటన కొత్తవంగల్లులో చోటు చేసుకుంది. చింతా ప్రసాద్‌ కుమారుడు యశ్వంత్‌  గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. అందరి లాగే అమ్మఒడికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే యశ్వంత్‌కు ఆ గ్రామంలో 30.39 సెంట్లు భూమి ఉన్నట్లు తేల్చారు. దీంతో అమ్మఒడి కోల్పోయారు. సంబంధిత అధికారులు తమకు అమ్మఒడి పథకం వచ్చేలా చూడాలని వారు కోరుతున్నారు. 

Updated Date - 2020-03-02T11:05:15+05:30 IST