మాదిగ అమర వీరులకు నివాళులు

ABN , First Publish Date - 2020-03-02T11:04:44+05:30 IST

మాదిగ అమర వీరులకు నివాళులు

మాదిగ అమర వీరులకు నివాళులు

నెల్లూరు(వీఆర్సీ) మార్చి 1: ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ప్రాణాలు అర్పించిన మాదిగ వీరులకు ఆదివారం నగరంలోని జగ్గజీవన్‌రామ్‌ కాలనీలో నివాళులు అర్పించారు. ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు మందా పెంచలయ్య మాట్లాడుతూ హైదరాబాదులోని గాంధీభవన్‌ ఘటనలో సురేంద్ర, మహేష్‌, దామోదర్‌ ప్రాణాలు అర్పించి వీరమరణం పొందారన్నారు. పోలీసు లాఠీ చార్జిలో భారతి, రవి, ప్రభాకర్‌ జాతి కోసం అసువులు బాసారన్నారు. వీరి త్యాగాలను మాదిగ జాతి ఎన్నటీకీ మరచిపోదన్నారు. ఉద్యోగోన్నతి కల్పించడంతో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో జరిగే సమావేశానికి జిల్లాలోని మాదిగలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏ ప్రసాద్‌, వై సతీష్‌, అశోక్‌, నాగరాజు, ప్రసాద్‌, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-02T11:04:44+05:30 IST