జలవనరులశాఖకు ‘నివర్‌’ నష్టం రూ.186కోట్లు

ABN , First Publish Date - 2020-12-08T05:15:27+05:30 IST

నివర్‌ తుఫాను కారణంగా జలవనరులశాఖకు సుమారు రూ.186 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వానికి ఎస్‌ఈ సురేంద్రరెడ్డి నివేదిక పంపారు.

జలవనరులశాఖకు ‘నివర్‌’ నష్టం రూ.186కోట్లు

ప్రభుత్వానికి నివేదిక పంపిన ఎస్‌ఈ సురేంద్రరెడ్డి


చిత్తూరు(వ్యవసాయం), డిసెంబరు 7: నివర్‌ తుఫాను కారణంగా జలవనరులశాఖకు సుమారు రూ.186 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వానికి ఎస్‌ఈ సురేంద్రరెడ్డి నివేదిక పంపారు. మొత్తం 625 పనులకు తాత్కాలిక మరమ్మతులకు రూ.4.74కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ.186.46కోట్లు అవసరమని అంచనాలు తయారు చేశారు. ఇందులో.. తెగిన 109 చెరువుల తాత్కాలిక మరమ్మతులకు రూ.1.29 కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ.24.58కోట్లు కావాలని గుర్తించారు. అలాగే దెబ్బతిన్న 222 చెరువు కట్టలకు రూ.1.90కోట్లు (తాత్కాలిక), రూ.45.71కోట్లు (శాశ్వత), దెబ్బతిన్న 64 తూములకు రూ.32.13లక్షలు (తాత్కాలిక), రూ.18.51 కోట్లు (శాశ్వత), దెబ్బతిన్న 62 సర్‌ప్లస్‌వేర్‌లకు రూ.32.20లక్షలు (తాత్కాలిక), రూ.18.08కోట్లు (శాశ్వత), దెబ్బతిన్న 94 సప్లయ్‌ చానళ్లకు రూ.69.69లక్షలు (తాత్కాలిక), రూ.37.19 కోట్లు (శాశ్వత), 19 ప్రాంతాల్లో దెబ్బతిన్న ఆనికట్‌లకు రూ.12.38లక్షలు (తాత్కాలిక), రూ.11.32కోట్లు (శాశ్వత), దెబ్బతిన్న 47 చెక్‌డ్యాములకు రూ.6లక్షలు (తాత్కాలిక), రూ.25.19 కోట్లు (శాశ్వత), దెబ్బతిన్న ఏడు ఫీడర్‌ చానళ్లకు రూ.3.70 లక్షలు (తాత్కాలిక), రూ.5.85 కోట్లు (శాశ్వత), దెబ్బతిన్న ప్రాజెక్టు గేట్‌ తాత్కాలిక మరమ్మతులకు రూ.25వేలు, శాశ్వత మరమ్మతులకైతే రూ.2.50 లక్షలు అవసరమని గుర్తించారు. 

Updated Date - 2020-12-08T05:15:27+05:30 IST