ఉప ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటుదాం!

ABN , First Publish Date - 2020-12-06T03:30:36+05:30 IST

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి టీడీపీని గెలిపించి సత్తా చాటుదామని గూడూరు పట్టణ టీడీపీ పరిశీలకుడు పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ పిలుపునిచ్చారు.

ఉప ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటుదాం!
నివాళులర్పిస్తున్న పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌, నాయకులు

టీడీపీ నేతల పిలుపు

గూడూరు, డిసెంబరు 5: తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి టీడీపీని గెలిపించి సత్తా చాటుదామని గూడూరు పట్టణ టీడీపీ పరిశీలకుడు పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ పిలుపునిచ్చారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శనివారం ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించి నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజల్లో నిరసన వ్యక్తమవుతోందన్నారు. ఈ ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతోందన్నారు. ఇసుక అందుబాటులో లేకపోవడంతో ఎంతో మంది జీవనోపాధిని కోల్పోతున్నారన్నారు. రానున్న ఎంపీ ఉప ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపించుకునేలా కృషి చేద్దామన్నారు. కార్యక్రమంలో పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, నిమ్మకాయల నరసింహులు, జహంగీర్‌, మోహన్‌, భారతమ్మ, పులిమి శివ, గురవయ్య, అల్లీహుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-06T03:30:36+05:30 IST