అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి

ABN , First Publish Date - 2020-11-27T04:40:50+05:30 IST

అనంతపురం కళ్యాణదుర్గంలో ఓ యువతిపై రెండు రోజుల క్రితం అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని వైసీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి మగ్దూం డిమాండ్‌ చేశారు.

అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి

గూడూరు(రూరల్‌), నవంబరు 26: అనంతపురం కళ్యాణదుర్గంలో ఓ యువతిపై రెండు రోజుల క్రితం అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని వైసీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి మగ్దూం డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక దర్గావీధిలోని వైసీపీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడు రోజుల్లో పెళ్లి చేసుకోనున్న ఆ యువతిని ఐదుగురు దుండగులు అపహరించి అతికిరాతంగా వ్యవహరించా రన్నారు.  దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలన్నారు. కార్యక్రమంలో జహీర్‌, జమీర్‌, యస్థాని, కాలేషా, బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-27T04:40:50+05:30 IST