హత్యాయత్నం నిందితులపై రౌడీషీట్
ABN , First Publish Date - 2020-03-13T10:16:24+05:30 IST
వెంకటాచలం మండలం నిడిగుంటపాళెం ఆరుంధతీ వాడకు చెందిన బిరదవోలు మణెమ్మ, అల్లుడు మణికంఠపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన
నెల్లూరు రూరల్ డీఎస్పీ హరినాథ్‌రెడ్డి
వెంకటాచలం, మార్చి 12 : వెంకటాచలం మండలం నిడిగుంటపాళెం ఆరుంధతీ వాడకు చెందిన బిరదవోలు మణెమ్మ, అల్లుడు మణికంఠపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన నిందితులిద్దరిపై త్వరలో రౌడీషీట్ తేరవనున్నట్లు నెల్లూరు రూరల్ డీఎస్పీ వై హరినాథ్ రెడ్డి తెలిపారు. బుధవారం ఉదయం నిడిగుంటపాళెంలోని బిరదవోలు మణెమ్మ ఇంట్లోకి ప్రవేశించిన జాడ వెంకటరమణయ్య, భార్య లక్ష్మమ్మ కత్తి, ఇనుపరాడ్‌లతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడి అక్కడి నుంచి పరారయ్యారు. ఎస్పీ భాస్కర్ భూషణ్ అదేశాలతో 24 గంటల్లో పరారీలో ఉన్న ఇద్దరూ నిందితులను సర్వేపల్లి వద్ద గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం రూరల్ డీఎస్పీ హరినాథ్‌రెడ్డి వెంకటాచలం పోలీసు స్టేషన్‌లో మీడియా ముందు నిందితులను హాజరు పరిచి మాట్లాడారు.