-
-
Home » Andhra Pradesh » Nellore » nellore lo 20crors tho science park
-
నెల్లూరులో రూ.20 కోట్లతో సైన్సు పార్కు
ABN , First Publish Date - 2020-12-31T05:19:07+05:30 IST
నెల్లూరు నగరంలో ఐదెకరాల విస్తీర్ణంలో రూ.20 కోట్లతో సైన్సు పార్కు నిర్మించతలపెట్టామని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ తెలిపారు.

రాష్ట్రంలోనే మొదటిది
మంత్రి అనిల్
నెల్లూరు (సిటీ), డిసెంబరు 30 : నెల్లూరు నగరంలో ఐదెకరాల విస్తీర్ణంలో రూ.20 కోట్లతో సైన్సు పార్కు నిర్మించతలపెట్టామని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. ఆయన బుధవారం నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆ సైన్సు పార్కు రాష్ట్రంలోనే మొదటిది అవుతుందన్నారు. అలాగే నెల్లూరు నగరాన్ని వరద ముంపు నుంచి కాపాడేందుకు సలహాలు, సూచనల కోసం జనవరిలో అన్ని రాజకీయ పార్టీలు, పాత్రికేయులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పారు.