నెల్లూరులో రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2020-12-28T12:56:55+05:30 IST

జిల్లాలోని ఆత్మకూరు మండలం నారంపేట సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.

నెల్లూరులో రోడ్డు ప్రమాదం

నెల్లూరు: జిల్లాలోని ఆత్మకూరు మండలం నారంపేట సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఓ కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. బద్వేల్ నుండి నెల్లూరుకు వెళుతుండగా మార్గ మధ్యలో ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-12-28T12:56:55+05:30 IST