నెల్లూరులో బ్యాంకు ఉద్యోగి దారుణహత్య

ABN , First Publish Date - 2020-12-07T17:32:52+05:30 IST

నగరంలోని వల్లభాయ్ పటేల్ నగర్‌లో కాంట్రాక్ట్ బ్యాంకు ఉద్యోగి రవిశంకర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు.

నెల్లూరులో బ్యాంకు ఉద్యోగి దారుణహత్య

నెల్లూరు: నగరంలోని వల్లభాయ్ పటేల్ నగర్‌లో కాంట్రాక్ట్ బ్యాంకు ఉద్యోగి రవిశంకర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు.  విజయవాడకి వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రవిశంకర్‌ గొంతులో పొడిచి కిరాతకంగా హతమార్చారు. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జనవరి 8న రవిశంకర్ రెడ్డి వివాహానికి ముహర్తం ఖరారైంది. ప్రేమ వ్యవహారాలే కారణమై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

Updated Date - 2020-12-07T17:32:52+05:30 IST