-
-
Home » Andhra Pradesh » Nellore » nellore
-
నెల్లూరు: తాటిపర్తి వాగు వద్ద చిక్కుకున్న కూలీలు
ABN , First Publish Date - 2020-11-27T16:52:31+05:30 IST
జిల్లాలోని పొదలకూరు మండలం తాటిపర్తి వాగు వద్ద భవనంలో దాదాపు 30 మంది కూలీలు చిక్కుకుపోయారు.

నెల్లూరు: జిల్లాలోని పొదలకూరు మండలం తాటిపర్తి వాగు వద్ద భవనంలో దాదాపు 30 మంది కూలీలు చిక్కుకుపోయారు. తాటిపర్తిలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన కూలీలు వరి నాట్లు వేయడానికి వచ్చినట్లు తెలుస్తోంది. భవనం చుట్టూ నీరు చేరడంతో బైటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. నిన్న సాయంత్రం నుంచి సాయం కోసం కూలీలు ఎదురుచూపులు చేస్తున్నారు. భవనంలోని కూలీల్లో అత్యధికంగా మహిళలే ఉన్నారు. విషయం తెలిసిన అధికారులు... బోటు సహాయంతో కూలీలను బయటికి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.