నెల్లూరులో నివర్ తుపాన్ బీభత్సం

ABN , First Publish Date - 2020-11-27T12:44:09+05:30 IST

జిల్లాలో నివర్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. సోమశిలకి పైఎత్తు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

నెల్లూరులో నివర్ తుపాన్ బీభత్సం

నెల్లూరు: జిల్లాలో నివర్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. సోమశిలకి పైఎత్తు నుంచి భారీగా  వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం డ్యాంలో 74 టీఎంసీలకు పైగా నీరు వచ్చింది. దీంతో అధికారులు 1,70,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు వరద ముంపులో ఉండిపోయాయి. కలకత్తా - చెన్నై జాతీయరహాదరిపై 50 కిలోమీటర్ల దూరం మేర  వాహనాలు నిలిచిపోయాయి.  నిన్న సాయంత్రం నుంచి ఆహారం, తాగునీరు లేక  వేలాది మంది ప్రయాణికులు అల్లాడుతున్నారు. తిప్పవరప్పాడు వద్ద వాగు, కైవల్య నది ప్రవాహం మధ్య చిక్కిన యాభై మందిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు అధికారుల అవస్థులు పడుతున్నారు. 


గతంలో ఎన్నడూ లేనంతంగా  పెన్నా, కైవల్య, కాళంగి, స్వర్ణముఖి నదులు, వాగులు, వంకలు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నీటి కుండల్లా ఉండటంతో ఏక్షణాన ఏ చెరువు తెగుతుందో అర్ధం కాని స్థితి నెలకొంది. తుపాన్ బీభత్సంతో జిల్లా భయం గుప్పెట్లోకి వెళ్లింది. వందల సంఖ్యలో ఇళ్లు కూలిపోవడంతో వేలాది మంది పేద ప్రజలు నిరాశ్రుయులయ్యారు. అలాగే వందల సంఖ్యలో విద్యుత్తు స్తంభాలు నేలకొరగడంతో పలు గ్రామాల్లో నిన్నటి నుంచి గాఢాంధకారం నెలకొంది. 

Read more