జాతీయ రహదారిపై వాహనదారుల ఇక్కట్లు

ABN , First Publish Date - 2020-11-28T04:41:07+05:30 IST

నివర్‌ తుఫాన్‌తో జాతీయ రహదారిపై వాహనదారులు ఇక్కట్లు పడ్డారు.

జాతీయ రహదారిపై వాహనదారుల ఇక్కట్లు

తడ / సూళ్లూరుపేట, నవంబరు 27 : నివర్‌ తుఫాన్‌తో జాతీయ రహదారిపై వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. గూడూరు - మనుబోలు మధ్య జాతీయ రహదారిపై వరదనీరు పారుతుండటంతో పోలీసులు వాహన రాకపోకలను నిలిపివేశారు. ఈ క్రమంలో సూళ్లూరుపేట టోల్‌ప్లాజా నుంచి మాంబట్టు సెజ్‌ రోడ్డు వరకు, తడ శ్రీసిటీ జీరోపాయింట్‌ నుంచి చెక్‌పోస్టు వరకు నెల్లూరు వైపు వెళ్లే అన్ని వాహనాలను నిలిపివేశారు. దూరప్రాంతాలకు వెళ్లే కొన్ని భారీ వాహనాలను శ్రీసిటీలోని ఖాళీ ప్రదేశానికి మళ్లించారు. సాయంత్రం అధికారుల ఆదేశాలతో కొన్ని కొన్ని వాహనాలను జాతీయ రహదారిపైకి వదిలారు.


Read more