:నాడు-నేడు పనులు సత్వరం పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2020-12-31T03:36:41+05:30 IST

నాడు-నేడు పథకం కింద జరుగుతున్న పాఠశాలల అభివృద్ధి పనులను సత్వరం పూర్తి చేయాలని డీఈవో రమేష్‌ ఆదేశించారు. ముత్తుకూరులో బుధవారం ఆయన పాఠశాలల్లో జరుగుతున్న నిర్మాణ పనులను ప

:నాడు-నేడు పనులు సత్వరం పూర్తి చేయాలి
నాడు-నేడు పనులను పరిశీలిస్తున్న డీఈవో రమేష్‌

ముత్తుకూరు, డిసెంబరు30: నాడు-నేడు పథకం కింద జరుగుతున్న పాఠశాలల అభివృద్ధి పనులను సత్వరం పూర్తి చేయాలని డీఈవో రమేష్‌ ఆదేశించారు. ముత్తుకూరులో బుధవారం ఆయన పాఠశాలల్లో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనవరి 15వ తేదీ నాటికి నాడు-నేడు పనులు పూర్తి కావాలన్నారు.  ఉన్నత పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పాఠ్యాంశాల అభ్యసన తీరు, విద్యార్థుల సామర్థ్యం వంటి అంశాలను పరిశీలించారు. ఉపాధ్యాయులతో సమావేశమై, విద్యాపరమైన సూచనలు చేశారు.  కార్యక్రమంలో ఎంఈవో మధుసూదన, ప్రధానోపాధ్యాయులు చెంచురామయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-31T03:36:41+05:30 IST