-
-
Home » Andhra Pradesh » Nellore » Muttadi
-
డీఈవో కార్యాలయం ముట్టడి
ABN , First Publish Date - 2020-12-11T05:08:59+05:30 IST
ఉపాధ్యాయుల బదిలీల పక్రియలో పోస్టులను బ్లాక్ చేయడాన్ని నిరసిస్తూ ఫ్యాప్టో ఆధ్వరంలో గురువారం డీఈవో కార్యాలయాన్ని ఉపాధ్యాయులు ముట్టడించారు.

ఫ్యాప్టో పిలుపుతో తరలివచ్చిన ఉపాధ్యాయులు
సమస్యల పరిష్కారం కోసం ప్రాణాలైనా అర్పిస్తాం
ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట)డిసెంబరు 10: ఉపాధ్యాయుల బదిలీల పక్రియలో పోస్టులను బ్లాక్ చేయడాన్ని నిరసిస్తూ ఫ్యాప్టో ఆధ్వరంలో గురువారం డీఈవో కార్యాలయాన్ని ఉపాధ్యాయులు ముట్టడించారు. అనంతరం అధికారులు, సిబ్బంది విధులకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఉదయం 9 గంటల నుంచే ప్రారంభమైన ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా వందలాదిమంది ఉపాధ్యాయులు తరలివచ్చారు. నిరసనలో ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఉపాఽధ్యాయుల న్యాయమైన కోరికలు ప్రభుత్వం తీర్చే వరకు ఉపాధ్యాయు ఉద్యమ నాయకుల వెంట ఉంటామని, సమస్యల పరిష్కారానికి చివరికి ప్రాణాలను సైతం అర్పించ డానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఫ్యాప్టో నాయకులు శ్రీనివాసులు మాట్లాడుతూ చివరి అంకంలో పోస్టులను బ్లాక్ చేయడం పట్ల సామాన్య ఉపాఽధ్యాయుల నుంచి ఉపాధ్యాయ సంఘాల నాయకుల వరకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతు న్నదన్నారు. అయినా విద్యాశాఖ ఉన్నతాఽధికారులు ఈ విషయంలో నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు సీహెచ్ అత్తయ్య, తులసి రాంబాబు, సురేందర్‌రెడ్డి, మురళీధర్, రమేష్, ముధుసూదన్, నవకోటేశ్వరావు, రాజమనోహర్, దశరథరాములు, చిరంజీవి, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.