నేటి నుంచి ముత్యాలమ్మ జాతర

ABN , First Publish Date - 2020-03-17T09:46:12+05:30 IST

చిల్లకూరు మండల పరిధిలోని తూర్పు కనుపూరులో నేటి నుంచి ముత్యాలమ్మ జాతర ప్రారంభం కానుంది.

నేటి నుంచి ముత్యాలమ్మ జాతర

మొదలైన సందడి

వెంటాడుతున్న కరోనా భయం


చిల్లకూరు, మార్చి 16: చిల్లకూరు మండల పరిధిలోని తూర్పు కనుపూరులో నేటి నుంచి  ముత్యాలమ్మ జాతర ప్రారంభం కానుంది. జాతరలో ముత్యాలమ్మతో పాటు పోలేరమ్మకు సైతం భక్తులు మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ.


జాతర ప్రస్థానం....

చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరు, ఈదలవారిపాళెం, పోసినవారిపాళెం, రావులవారిపాళెం గ్రామాలు 1918కి పూర్వం వెంకటగిరి రాజుల పాలనలో ఉండేవి. వారు సింహాద్రి రామలింగయ్యశెట్టి ద్వారా ముత్యాలమ్మ విగ్రహాన్ని ప్రతిష్టింపజేసినట్లు స్థానికుల అభిప్రాయం. అప్పటి  నుంచి వేసవి ప్రారంభంలో ఉగాదికి ముందు వచ్చే మంగళవారం నుంచి గురువారం వరకు జాతర నిర్వహిస్తున్నారు. 1982 నుంచి క్రమం తప్పకుండా  జాతర నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి పోలేరమ్మ నిలుపు, 18న యార గురునాఽథస్వామి, అంకమ్మ దేవతల గ్రామోత్సవం, గొల్లల వేడుకలు, 19వ తేదీ పగలు గురునాఽథస్వామి గ్రామోత్సవం, రాత్రి అమ్మణ్ణి ఉయ్యాల సేవ, 20న శుక్రవారం ఉదయం పోలేరమ్మ సాగనంపు ఉత్సవం, వేలంపాటలు నిర్వహిస్తారు.


జాతకు కరోనాభయం....

     ముత్యాలమ్మ జాతరకు ఈ ఏడాది కరోనా వైరస్‌ భయం పట్టుకుంది. ఇప్పటికే విదేశాల నుంచి వచ్చే వారు వారి కుటుంబ సభ్యులు, ఇతర ప్రాంతాల వారు ప్రయాణం వాయిదా వేసుకుని సహకరించాలని అధికారులు కోరారు. ఈదలవారిపాళెం, అద్దేపల్లి, పోసినవారిపాళెం, రాములవారిపాళెం గ్రామాల ప్రజలను మాత్రమే జాతరకు అనుమతిస్తామని రూరల్‌సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. స్థానికులు మాత్రమే జాతరలో పాల్గొనాలని సబ్‌కలెక్టర్‌ గోపాలకృష్ణ అవగాహన కల్పిస్తున్నారు. జాతర ఏర్పాట్లను ఆలయ ఈవో కోవూరు జనార్థన్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.

Updated Date - 2020-03-17T09:46:12+05:30 IST