అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2020-03-13T10:18:16+05:30 IST

కరోనా వ్యాధిపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని వైద్యశాఖ జేడీ డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌, కరోనా వ్యాధిపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని వైద్యశాఖ జేడీ డాక్టర్‌

అప్రమత్తంగా ఉండాలి

కరోనా లక్షణాలు ఉంటే జీజీహెచ్‌లో పరీక్ష చేయించుకోవాలి

వైద్యశాఖ జేడీ, డీఎంహెచ్‌వో


నెల్లూరు (వైద్యం), మార్చి 12 : కరోనా వ్యాధిపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని వైద్యశాఖ జేడీ డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌, కరోనా వ్యాధిపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని వైద్యశాఖ జేడీ డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజ్యలక్ష్మి కోరారు. గురువారం నెల్లూరులోని పాత మున్సిపల్‌ కార్యాలయంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, వలంటీర్లకు కరోనా గుర్తింపుపై అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్న వారు ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో రక్తపరీక్షలు చేయించుకునేలా చైతన్యం తీసుకురావాలన్నారు. గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఆశా కార్యకర్త, వార్డు వలంటీర్లు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని, అనుమానిత కేసులు ఉంటే అధికారులకు తెలియచేయాలని ఆదేశించారు.


విదేశాల నుంచి వచ్చే వారు 14 రోజులు ఇంట్లోనే ఉండాలని బయటకు వెళ్లవద్దని కోరారు. వారి ఆరోగ్యం విషయంలో వైద్యుల పర్యవేక్షణ ఉంటుందన్నారు. జడ్పీ కార్యాలయంలో కరోనా సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, అక్కడి నుంచి సలహాలు, సూచనలు పొందవచ్చన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత తప్పక పాటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌ మూర్తి, ఏడీఎంహెచ్‌వో డాక్టర్‌ స్వర్ణలత, మున్సిపల్‌ హెల్త్‌ అఽధికారి డాక్టర్‌ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-13T10:18:16+05:30 IST