-
-
Home » Andhra Pradesh » Nellore » murder
-
భూ వివాదానికి ఒకరి బలి
ABN , First Publish Date - 2020-11-22T04:05:17+05:30 IST
భూ ఆక్రమణను అడ్డుకున్నాడన్న కోపంతో సొంత అన్న కొడుకులే చిన్నాన్నపై దాడి చేయడంతో అతడు మృతి చెందాడు

కొడుకులే చిన్నాన్నను చంపేశారు
అమ్మపాళెంలో దారుణం
వెంకటగిరి, నవంబరు 21: భూ ఆక్రమణను అడ్డుకున్నాడన్న కోపంతో సొంత అన్న కొడుకులే చిన్నాన్నపై దాడి చేయడంతో అతడు మృతి చెందాడు. వెంకటగిరి మండలం అమ్మపాళెం గ్రామానికి చెందిన అరని శ్రీనివాసులు (60)కు చెందిన పొలాన్ని అతని అన్న పెదకాటయ్య కుమారులు వేణు, లక్ష్మయ్య, తిరుమలపతి, హరికృష్ణ ఆక్రమించారు. శనివారం ఆ పొలాన్ని దున్నేందుకు చర్యంలు తీసుకుంటుండగా శ్రీనివాసులు అడ్డుకున్నాడు. దీంతో ఆగ్రహించిన వారు అతడిపై కర్రలు, కత్తులతో దాడి చేశారు. దాంతో తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులును కుటుంబసభ్యులు 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలిస్తుండగా మృతి చెందాడని, కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ నాగమల్లేశ్వరరావు తెలిపారు.