కోనలో పోటెత్తిన భక్తులు

ABN , First Publish Date - 2020-12-26T04:17:04+05:30 IST

ముక్కోటి ఏకాదశి సందర్భంగా పెంచలకోనలో భక్తులు పోటెత్తారు. సప్తద్వారాల ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారు.

కోనలో పోటెత్తిన భక్తులు
విశేషాలంకరణలో గోదాదేవి అమ్మవారు

గోదాదేవికి ఆస్థానసేవ

రాపూరు, డిసెంబరు 25:  ముక్కోటి ఏకాదశి సందర్భంగా పెంచలకోనలో భక్తులు పోటెత్తారు.  సప్తద్వారాల ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున మూలవిరాట్‌కు ఆలయ అర్చకులు అభిషేకాలు నిర్వహించి నిజరూప దర్శనం కల్పించారు. గరుడ వాహనంపై కొలువుదీరిన శ్రీవార్లను నమ్మాళ్వార్‌కు తొలి దర్శనం అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.  శ్రీవారు, గోదాదేవి, నమ్మాళ్వార్‌కు ఆస్థానసేవ నిర్వహించారు.

శ్రీవారి సేవలో డిప్యూటీ కమిషనరు

కాకినాడ దేవదాయ ధర్మదాయశాఖ డిప్యూటీ కమిషనరు విజయరాజు, కోన ఆలయ మాజీ చైర్మన్‌ నెల్లూరు రవీంద్రారెడ్డి శ్రీవార్లను దర్శించుకుని పూజలు చేశారు.  ఆలయ ఏసీ వెంకటసుబ్బయ్య  స్వాగతం పలుకగా, అర్చకులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.Updated Date - 2020-12-26T04:17:04+05:30 IST