వరద బాధితులను సమష్టిగా అదుకోవాలి

ABN , First Publish Date - 2020-11-27T04:50:03+05:30 IST

వర్‌ తుఫాను కారణంగా నిరాశ్రయులైనవారిని అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా అదుకోవాలని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు.

వరద బాధితులను సమష్టిగా అదుకోవాలి

విడవలూరు, నవంబరు 26: నివర్‌ తుఫాను కారణంగా నిరాశ్రయులైనవారిని అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా అదుకోవాలని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. చౌకిచర్ల గ్రామంలో ముంపునకు గురైన కాలనీలను గురువారం ఆయన పర్యటించారు.  పునారావాస కేంద్రాల్లో ఉంటున్న పేదలకు నిత్యావసర వస్తువులు, దుప్పట్లను, నగదు  అందజేశారు.  ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చిరంజీవి, తహసీల్దారు చంద్రశేఖర్‌, కోవూరు సీఐ రామారావు, వైసీపీ నాయకులు బెజవాడ గోవర్ధన్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, సమాధి శ్రీనివాసులు, ఓగునాగేశ్వరరావు, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-27T04:50:03+05:30 IST