కామాక్షితాయిని దర్శించుకున్న ఎమ్మెల్యే ప్రసన్న కుటుంబం

ABN , First Publish Date - 2020-10-24T11:31:17+05:30 IST

శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా జొన్నవాడలోని శ్రీమల్లికార్జునస్వామి, కామాక్షితాయి అమ్మవార్లను కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, గీతారెడ్డి దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

కామాక్షితాయిని దర్శించుకున్న  ఎమ్మెల్యే ప్రసన్న కుటుంబం

బుచ్చిరెడ్డిపాళెం, అక్టోబరు 23:  శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా జొన్నవాడలోని శ్రీమల్లికార్జునస్వామి, కామాక్షితాయి అమ్మవార్లను కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, గీతారెడ్డి దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా ఆలయ చైర్మన్‌ చీమల రమేష్‌బాబు, ఈవో ఏవీ. శ్రీనివాసులురెడ్డి, అర్చకులు ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్ల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు తీర్థ ప్రసాదాలతోపాటు శేషవస్ర్తాలను అందజేశారు.


  అనంతరం సీఎం జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఏ దుష్టశక్తి అడ్డుపడకుండా పరిపాలన బాగుండేలా దీవెనలు అందించాలని స్వామి, అమ్మవార్లను కోరుకున్నట్లు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జలవనరుల శాఖామంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, దేవాదాయశాఖ మంత్రి ద్వారా సీఎంతో మాట్లాడి జొన్నవాడ దేవస్థానాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకువస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గుమ్మా ప్రమీలమ్మ, ఇన్నమూరు నరసింహారావు, తాతా ప్రభాకర్‌, వైసీపీ నేతలు పి. మురళి, బాలకృష్ణ, రమణయ్య, ప్రసాద్‌, సాగర్‌, మీనాతో పాటు గుమ్మా సుధాకరయ్య పాల్గొన్నారు.

Updated Date - 2020-10-24T11:31:17+05:30 IST