ప్రతి అర్హత కుటుంబానికి ఇంటి స్థలం : ఎమ్మెల్యే కాకాణి

ABN , First Publish Date - 2020-07-28T11:11:54+05:30 IST

నియోజకవర్గంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికీ ఇంటి స్థలం కేటాయిస్తామని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు.

ప్రతి అర్హత కుటుంబానికి ఇంటి స్థలం :  ఎమ్మెల్యే కాకాణి

వెంకటాచలం, జూలై 27 : నియోజకవర్గంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికీ ఇంటి స్థలం కేటాయిస్తామని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో సోమవారం పేదలందరికీ ఇళ్ల పథకంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో తహసీల్దారు ఐఎస్‌ ప్రసాద్‌, ఎంపీడీవో ఏ సరళ, వైసీపీ నేతలు కోదండరామిరెడ్డి, ప్రదీ్‌పకుమార్‌రెడ్డి, వెంకటశేషయ్య పాల్గొన్నారు.


Updated Date - 2020-07-28T11:11:54+05:30 IST