ఓజిలికి నేడు డిప్యూటీ సీఎం, నలుగురు మంత్రుల రాక
ABN , First Publish Date - 2020-12-16T03:52:47+05:30 IST
రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి నారాయణస్వామితోపాటు నలుగురు రాష్ట్ర మంత్రులు బుధవారం మండలానికి రానున్నారు.
ఓజిలి, డిసెంబరు 15 : రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి నారాయణస్వామితోపాటు నలుగురు రాష్ట్ర మంత్రులు బుధవారం మండలానికి రానున్నారు. డిప్యూటీ సీఎం, రాష్ట్ర అటవీశాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సాంకేతికశాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ వివిధ భవనాలను ప్రారంభించను న్నారు. మండలంలోని వాకాటివారికండ్రిగలో నిర్మించిన ఏకలవ్య గురుకుల పాఠశాల భవనం, పెద్దపరియలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, ఓజిలిలో నిర్మించిన సచివాలయ భవనాలను ప్రారంభిస్తారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో ఆయా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించేందుకు మండల నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
వెంకటాచలంలోనూ పర్యటన
వెంకటాచలం : వెంకటాచలం మండలానికి బుధవారం రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, నారాయణస్వామి, బాలినేని శ్రీనివాసులురెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్‌రెడ్డితోపాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు రానున్నట్లు ఎంపీడీవో ఏ సరళ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో వెంకటాచలం, సర్వేపల్లి, పూడిపర్తి గ్రామాల్లో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో వారు పాల్గొంటారని ఆమె పేర్కొన్నారు.