నేడు ఆత్మకూరులో మంత్రి పర్యటన

ABN , First Publish Date - 2020-12-14T04:34:06+05:30 IST

రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోమవారం ఆత్మకూరు, చేజర్ల మండలంలో పర్యటించనున్నట్లు మంత్రి కార్యాలయం ఒక ప్రక

నేడు ఆత్మకూరులో మంత్రి పర్యటన

ఆత్మకూరు, డిసెంబరు 13 : రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోమవారం ఆత్మకూరు, చేజర్ల మండలంలో పర్యటించనున్నట్లు మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఆత్మకూరులో నిర్మాణంలో ఉన్న ఆర్డీవో కార్యాలయం, ఆర్‌అండ్‌ బీ అతిథిగృహాన్ని పరిశీలిస్తారు. అనంతరం తుఫాన్‌ నష్టాలు, సంక్షేమ పథకాల అమలుతీరుపై ఆర్డీవో కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు చేజర్ల మండలంలోని కోటితీర్ధంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, తర్వాత స్థానిక కోటేశ్వర ఆలయంలో కార్తీక మాస పూజల్లో పాల్గొంటారు.

Updated Date - 2020-12-14T04:34:06+05:30 IST