-
-
Home » Andhra Pradesh » Nellore » Mining operations should be stopped
-
మైనింగ్ కార్యకలాపాలు నిలిపి వేయాలి
ABN , First Publish Date - 2020-03-24T07:27:49+05:30 IST
కోవిడ్ - 19 కట్టడిలో భాగంగా నేటి నుంచి మార్చి 31వ తేదీ వరకు జిల్లాలో మైనింగ్ కార్యకలాపాలు

మైనింగ్ శాఖ ఏడీ పీ వెంకటేశ్వరరెడ్డి
నెల్లూరు (వెంకటేశ్వరపురం), మార్చి 23 :కోవిడ్ - 19 కట్టడిలో భాగంగా నేటి నుంచి మార్చి 31వ తేదీ వరకు జిల్లాలో మైనింగ్ కార్యకలాపాలు నిలిపి వేయాలని మైనింగ్ శాఖ ఏడీ వెంకటేశ్వరరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మైనింగ్ లీజులు, మినరల్ డీలర్స్ లైసెన్స్ పొందిన వారు రవాణా చేసే వారు ప్రతి ఒక్కరూ మార్చి 31వ తేదీ వరకు పూర్తి స్థాయిలో పనులు నిలిపి వేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.