గేదెల మినీవ్యాన్‌ బోల్తా

ABN , First Publish Date - 2020-12-12T04:54:24+05:30 IST

నాయుడుపేట - నరసారెడ్డికండ్రిగ మార్గంలో జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున గేదెలతో వెళ్తున్న మినీ వ్యాన్‌ బోల్తా కొట్టింది.

గేదెల మినీవ్యాన్‌ బోల్తా

నాయుడుపేట టౌన్‌, డిసెంబరు 11 : నాయుడుపేట - నరసారెడ్డికండ్రిగ మార్గంలో జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున గేదెలతో వెళ్తున్న మినీ వ్యాన్‌ బోల్తా కొట్టింది. నెల్లూరు నుంచి గేదెలతో చెన్నై వెళ్తున్న వ్యాన్‌ మార్గ మధ్యంలో నరసారెడ్డికండ్రిగ వద్దకు రాగానే టైరు పంక్చర్‌కావడంతో డివైడర్‌ ఢీ కొని పక్కనే ఉన్న గుంతలో బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు గేదెలకు తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-12-12T04:54:24+05:30 IST