వలస కూలీలకు చేయూతనందించాలి

ABN , First Publish Date - 2020-04-28T10:08:58+05:30 IST

వలస కూలీలు, రేషన్‌ కార్డులేని పేదలకు ప్రభుత్వం కరోనా సాయం అందించాలని ఏపీ రైతు సంఘం

వలస కూలీలకు చేయూతనందించాలి

ఏపీ రైతు సంఘం రాష్ట్ర నేత షాన్‌వాజ్‌


నెల్లూరు(వైద్యం), ఏప్రిల్‌ 27: వలస కూలీలు, రేషన్‌ కార్డులేని పేదలకు ప్రభుత్వం కరోనా సాయం అందించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర నేత షాన్‌వాజ్‌ కోరారు. సీపీఐ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లాక్‌డౌన్‌ కారణంగా అనేక మంది పేదలు ఇంటి అద్దెలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నారన్నారు. కరెంటు బిల్లులు ప్రభుత్వం రద్దు చేయాలని కోరారు. నిరుపేదలకు కమ్యూనిస్టులు, స్వచ్ఛంద సంస్థలు నిత్యావసరాలు, ఆహారం అందిస్తుంటే కేసులు పెట్టడం సరికాదన్నారు. రెవెన్యూ అధికారులు, వైసీపీ నేతలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోవటం లేదని విమర్శించారు. అనంతరం కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇన్సాఫ్‌ జిల్లా అధ్యక్షుడు అజీజ్‌, ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు సిరాజ్‌, నాగేంద్ర, సుభానీ, గోపాల్‌, రాజేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-04-28T10:08:58+05:30 IST