మెడికల్‌ సర్వీసెస్‌ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-12-27T04:26:10+05:30 IST

కలెక్టర్‌ చక్రధర్‌బాబు శనివారం బంగ్లాలో హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్‌ మెడికల్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ టేబుల్‌ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.

మెడికల్‌ సర్వీసెస్‌ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్‌
క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు

నెల్లూరు(హరనాథపురం), డిసెంబరు 26 : కలెక్టర్‌ చక్రధర్‌బాబు శనివారం బంగ్లాలో  హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్‌ మెడికల్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ టేబుల్‌ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్‌ సమయంలో డాక్టర్‌లు, వైద్యసిబ్బంది అందించిన సేవలు విశేషమైనవన్నారు. వారి సమస్యల విషయంలో వెంటనే స్పందిస్తామన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో డాక్టర్లు, సిబ్బంది డిమాండ్ల సాధనకు కృషి చేస్తామని హంస అధ్యక్షుడు చేజర్ల సుధాకర్‌రావు చెప్పారు. కార్యక్రమంలో హంస జిల్లా అసోసియేట్‌ అధ్యక్షుడు డాక్టర్‌ అమరేంద్రనాథ్‌రెడ్డి,  కార్యదర్శి బి.కమల్‌ కిరణ్‌, గౌరవాధ్యక్షుడు డాక్టర్‌ వెంకటేశ్వర్లు, డాక్టర్‌ శశికళ, డాక్టర్‌ వివేకానందరెడ్డి, ఆర్‌. ఇందిర, శ్రీనివాసులు, జలీల్‌ అహ్మద్‌, నాగరాజు పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-27T04:26:10+05:30 IST