23 నుంచి ప్రభుత్వ వైద్య కళాశాల పునఃప్రారంభం

ABN , First Publish Date - 2020-11-14T05:10:52+05:30 IST

నెల్లూరులోని ప్రభుత్వ వైద్య కళాశాలను ఈ నెల 23వ తేదీన పునః ప్రారంభించనున్నారు.

23 నుంచి ప్రభుత్వ వైద్య కళాశాల పునఃప్రారంభం

నెల్లూరు(వైద్యం), నవంబరు 13 : నెల్లూరులోని ప్రభుత్వ వైద్య కళాశాలను ఈ నెల 23వ తేదీన పునః ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చినట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సాంబశివరావు పేర్కొన్నారు. ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయని, నీట్‌లో ర్యాంకులు సాధించిన వారిలో 10 మంది కళాశాలలో ప్రవేశం పొందారని తెలిపారు. కరోనా కారణంగా ఈ ఏడాది మార్చి నుంచి కళాశాల మూతపడిన విషయం విదితమే. 

Updated Date - 2020-11-14T05:10:52+05:30 IST