అలగానిపాడులో భారీ చోరీ
ABN , First Publish Date - 2020-09-14T10:25:54+05:30 IST
మండల పరిధిలోని అలగానిపాడులో ఆదివారం భారీ చోరీ జరిగింది.
40 సవర్లకుపైగా బంగారం, రెండున్నర కేజీల వెండి,
2.90 లక్షల నగదు అపహరణ
పట్టపగలే దారుణం
విచారణ చేపట్టిన కోవూరు సీఐ
విడవలూరు, సెప్టెంబరు 13: మండల పరిధిలోని అలగానిపాడులో ఆదివారం భారీ చోరీ జరిగింది. ఈ ఘటనలో సుమారు 40 సవర్లకుపైగా బంగారం, 2.5కిలోల వెండి, రూ. 2.90లక్షల నగదు దొంగతనం జరిగింది. పట్టపగలే గ్రామంలో భారీ చోరీ జరగటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. బాధితుడు, స్థానికుల కథనం మేరకు, గ్రామానికి చెందిన చింతాటి సుధాకర్ చిన్నపాటి కరెంటు పనులు చేసుకునేవాడు, అతడి భార్య అంగన్‌వాడీ కార్యకర్తగా పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం.
సొంత పనుల నిమిత్తం మఽధ్యాహ్నాం 2 గంటలకు నెల్లూరుకి కుటుంబ సభ్యులతో కలసి వెళ్లిన సుధాకర్ తిరిగి 6 గంటలకు ఇంటికి చేరుకున్నాడు. లోపలికి వెళ్లి చూడగా ఇంటి తలుపులు, బీరువాను పగులగొట్టి ఉండటాన్ని గమనించాడు. బీరువాలో ఉన్న బంగారం, వెండి, నగదు కనపడకపోవటంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కోవూరు సీఐ రామారావు, ఎస్‌ఐ మహేంద్ర సంఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. ఈ మేరకు బాధితుడిని వద్ద ఫిర్యాదు తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.