చేయి చేయి కలిపి చేయూతనిస్తూ..

ABN , First Publish Date - 2020-04-05T09:43:25+05:30 IST

దేశమంతా కనబడని శత్రువుతో పోరాడుతున్న విపత్కర పరిస్థితుల్లో ఆదాయ వనరులకు అన్ని దారులు మసుకుపోయాయి.

చేయి చేయి కలిపి చేయూతనిస్తూ..

నెల్లూరు (సిటీ), ఏప్రిల్‌ 4 : దేశమంతా కనబడని శత్రువుతో పోరాడుతున్న విపత్కర పరిస్థితుల్లో ఆదాయ వనరులకు అన్ని దారులు మసుకుపోయాయి. రోజుల తరబడి ఉపాధి కోల్పోయి నిరాశ్రయులైన పేదలకు ఎంతో మంది చేయూతనందిస్తున్నారు. ఆహారం, నిత్యావసరాలు, కూరగాయలు, కరోనా కట్టడికి మాస్క్‌లు, గ్లౌజులు అందజేస్తూ తమ ఉదారతను చూపుతున్నారు. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా నిలుస్తూ ఆర్థిక నవరులను సమకూర్చుతున్నారు. 


వెంకటాచలం మండలం పుంజులురుపాడు వైసీపీ నేతలు కొణిదెన భాస్కర్‌ నాయుడు, మోహన్‌నాయుడులు కలిసి రూ.లక్ష, బాలకృష్ణ నాయుడు రూ.లక్ష, పేర్నాటి రాంబాబు, వెంకటేశ్వర్లు నాయుడు, కొణిదెన నరస్ప నాయుడులు రూ.90 వేలు, బెల్లంకొండ సుబ్బనాయుడు రూ.20 వేలు మొత్తం రూ.3.1 లక్షలు ఎమ్మెల్యే కాకాణికి అందజేశారు. ఈ నగదుతో బియ్యం కొనుగోలు చేసి పేదలకు పంపిణీ చేయనున్నారు.


కొడవలూరు మండలంలో జరుగుతున్న సహాయక చర్యలకు అనుగుణంగా డీసీఎంఎస్‌ చైర్మన్‌ వీరి చలపతిరావు రూ.1లక్ష చెక్కును ఎమ్మెల్యే ప్రసన్న చేతులమీదుగా తహసీల్దారు లాజరస్‌కు అందజేశారు.


 వెంకటగిరిలో పోలీసులకు టీవీఎస్‌ సంస్థ గ్లౌజులు, మాస్కులు అందించింది. రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ సిబ్బందికి ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందించారు. 


 కావలి ఏరియా ఆసుపత్రి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్‌ కిషోర్‌ నిత్యావసరాలు అందించారు. 


 కోడూరుపాడులో గిరిజనులకు యానదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో  కేసీ పెంచలయ్య, శేఖర్‌ బియ్యం అందచేశారు. 


 నెల్లూరురూరల్‌ మండలం సౌత్‌మోపూరులో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కూరగాయలు అందించారు. 


 నెల్లూరులోని ఏసీ కూరగాయల మార్కెట్‌ అసోసియేషన్‌  అన్ని రకాల కాయగూరలను కేవలం రూ.10లకే పంపిణీ చేసింది. 29వ డివిజన్‌ శానిటేషన్‌ సిబ్బంది ఒక్క రోజు ఆయా ప్రాంతాలలోని పేదలకు అన్నదానం చేశారు. నారాయణరెడ్డిపేటలో మాజీ కార్పొరేటర్‌ లేబూరు పరమేశ్వరరెడ్డి ద్వారా సీపీఐ అనుబంధ సంఘాలు నాయకులు కూరగాయాలు అందచేశారు. 


 ఇందుకూరుపేట మండలం కుడితిపాళెంలో గిరిజనులకు విజయ డెయిరీ చైర్మన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డి కూరగాయలు పంపిణీ చేశారు. 


 గూడూరులో పీఎస్‌ఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో మాస్కులు, గ్లౌజులు, దుప్పట్లను మున్సిపల్‌ కమిషనర్‌ ఓబులేసుకు అందచేశారు. సాయిబాబ మందిరం, శ్రీకృష్ణ సేవాసమితి వృద్ధులకు ఆహార ప్యాకెటు అందజేసింది.  బ్యూరో ఆఫ్‌ సొషల్‌ సర్వీసు, టీఎన్‌ఎస్‌ఎఫ్‌, ఈద్గా యూత్‌ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. 


వెంకటగిరిలో ఎన్వీఆర్‌, చిల్లకూరులో కోట సునీల్‌కుమార్‌ ఫలసరుకులు అందించారు. 


జలదంకి మండలం వరదారెడ్డి గిరిజన కాలనీలో మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి, ఎస్‌ఐ ప్రసాద్‌ రెడ్డి నిత్యావసరాలు అందజేశారు. జెమ్స్‌ యువత జలదంకిలో చల్లాయానాదులకు నిత్యావసరాలు అందించింది.


ఇనమడుగు గిరిజన కాలనీలో ఏసీనగర్‌కు చెందిన వినాయక  భక్తులు ఆహారం సమకూర్చారు.


బుచ్చిలో విజిలెన్స్‌ కానిస్టేబుల్‌ మాస్కులు పంపిణీ చేయగా, పలువురు మీడియా ప్రతినిధులు పేదలకు ఆహార ప్యాకెట్లు అందించారు. చల్లాయపాళెంలో అంబేద్కర్‌ యూత్‌ ఆధ్వర్యంలో కరోనా నివారణ ద్రావణాన్ని స్ర్పే, బీజేపీ నాయకులు ఆహార ప్యాకెట్లు అందచేశారు. 


చేజర్ల మండలం బోడిపాడులో మాజీ సర్పంచ్‌ మాలకొండారెడ్డి నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఎన్వీ కండ్రికలో తేళ్ల శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు.


 ఆత్మకూరులో 15వ వార్డు ప్రజలకు అభిరామ్‌ హెల్త్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వైద్యులు శ్రావణ్‌కుమార్‌, సీహెచ్‌ ఆదిశేషయ్య కూరగాయలు పంపిణీ చేశారు.


విడవలూరు మండలం యలగాలమ్మగుంట కాలనీలో రేషన్‌ కార్డులు లేని గిరిజనులకు వైసీపీ నాయకులు పూండ్ల అచ్యుత్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, బెజవాడ గోవర్దన్‌రెడ్డిలు ఎమ్మెల్యే ప్రసన్న చేతులమీదుగా రూ.95వేలు, 5 కేజీల బియ్యం అందజేశారు.


సూళ్లూరుపేటలో  చిన్న పిల్లల వైద్యుడు రవికాంత్‌ రూ.75వేల విలువైన నిత్యావసర సరుకులను బాపూజీకాలనీలోని 140 గిరిజన కుటుంబాలకు జేవీవీ నిర్వాహకులతో కలిసి పంపిణీ చేశారు. 

Updated Date - 2020-04-05T09:43:25+05:30 IST