మల విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుదాం...

ABN , First Publish Date - 2020-11-20T02:54:02+05:30 IST

ప్రజలంతా కలసి మల విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని చెన్నపల్లిపాళెం జడ్పీ ఉన్నత పాఠ శాల ప్రధానోపాధ్యాయురాలు రూప పేర్కొన్నారు. జాతీయ మరుగు దొడ్ల దినోత్సవం సందర్భంగా గురువారం విద్యార్థులతో ర్యాలీ నిర్వ హించారు. ఈ

మల విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుదాం...
చెన్నపల్లిపాళెంలో ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులు

టీపీగూడూరు, నవంబరు19: ప్రజలంతా కలసి మల విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని చెన్నపల్లిపాళెం జడ్పీ ఉన్నత పాఠ శాల ప్రధానోపాధ్యాయురాలు రూప పేర్కొన్నారు. జాతీయ మరుగు దొడ్ల దినోత్సవం సందర్భంగా గురువారం విద్యార్థులతో  ర్యాలీ నిర్వ హించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మరుగుదొడ్లను వాడు తూ, పరిశుభ్రతను కాపాడుకుందామన్నారు.  కార్యక్రమంలో కో-ఆర్డి నేటర్‌ ఫణికుమార్‌, పీడీ సుమతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 


ముత్తుకూరులో..

ముత్తుకూరు, నవంబరు19: మరుగుదొడ్లను వినియోగించడం పై అవగాహన కల్పిస్తూ గురువారం ముత్తుకూరులో అధికారులు ర్యాలీ నిర్వహించారు. జాతీయ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా మండల పరిషత్‌ కార్యాలయం నుంచి ఎంపీడీవో ప్రత్యూష ఆధ్వర్యం లో ప్రజలకు అవగాహన కల్పించారు.  కార్యక్రమంలో ఈవోపీఆర్‌డీ స్వరూపారాణి, ఈవో చక్రం వెంకటేశ్వర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 


 పొదలకూరులో..

పొదలకూరు(రూరల్‌), నవంబరు 19 : పరిసరాల పరిశుభ్రతే ఆరోగ్యానికి మూలసూత్రమని డీఎల్‌డీవో సుజాత పేర్కొన్నారు. అం తర్జాతీయ టాయ్‌లెట్స్‌ డేను పురస్కరించుకొని మండలంలోని వావిం టపర్తి, పులికల్లు గ్రామాల్లో ఆమె గురువారం అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ సమాజంలో అన్ని వ్యాధుల వ్యాప్తికి పరిసరాల అపరిశుభ్రతే కారణమన్నారు. అనం తరం ఆమె చెత్త నుంచి సంపద కేంద్రాలను సందర్శించారు. అంత కు ముందు స్ధానిక మండల పరిషత్‌ కార్యాలయంలో జరిగిన సమా వేశానికి మండలంలోని 28 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంపీ డీవో నారాయణరె డ్డి, పీఆర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈలు ప్రసాద్‌, కసనా నాయక్‌, ఎంఈవో బాలకృష్ణారెడ్డిలు హాజరయ్యారు.


విడవలూరులో..

విడవలూరు, నవంబరు 19: ఆరుబయట మల విసర్జణ చేయ టం ఆరోగ్యానికి ప్రమాదకరమని ఎంపీడీవో చిరంజీవి తెలిపారు. ప్ర పంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఎం పీడీవో కార్యాలయం నుంచి అంకమ్మ దేవాలయం సెంటర్‌ వరకు అ ధికారులు, ఆరోగ్యసిబ్బంది, విద్యార్థులు అవగాహన ర్యాలీని నిర్వ హించారు. కార్యక్రమంలో తహసీల్దారు చంద్రశేఖర్‌, ఈవోపీఆర్డీ సా యిప్రసాద్‌, వైసీపీ నాయకులు గోవర్థన్‌రెడ్డి, నవీన్‌రెడ్డి  పాల్గొన్నారు. 


మనుబోలులో..

 మనుబోలు, నవంబరు 19: మరుగుదొడ్డిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఉపయోగించాలని ఎంపీడీవో వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం మనుబోలులో ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సంద ర్భంగా అధికారులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బహిరంగ మలవిసర్జన  రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు అందరూ న నడుంబిగించాలన్నారు.  కార్యక్రమంలో ఈవోఆర్‌డీ శేఖర్‌బాబు, ఏఈ. కార్తీక్‌ రెడ్డి, కార్యదర్శులు వెంకటరమ ణ, సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.


 బుచ్చిలో..

బుచ్చిరెడ్డిపాళెం,నవంబరు19: ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు వినియోగించుకోవాలని బుచ్చి పెద్దూరులోని దొడ్ల పద్మిని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు గండికోట సుధీర్‌కుమార్‌ అన్నారు. గురువారం ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక పెద్దూరు, బెస్తపాళెం, సుహాసినీకాలనీ,  కోనేటిమిట్ట ప్రాంతాల్లో ప్రజలకు మరుగుదొడ్లు వినియోగం, ఉపయోగాలు గురించి అవగాహన కల్పించారు. ఆరుబయట మలవిసర్జన వల్ల డయేరియా, టైఫాయిడ్‌, కడుపునొప్పి లాంటి వ్యాధులు వస్తాయని సూచించారు.


 రేబాలలో..

రేబాలలో పంచాయతీ కార్యాలయం వద్ద నుంచి అరుంధతీవాడ వరకు గ్రామ పంచాయతీ అధికారి శ్యాంసుందర్‌తోపాటు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు స్థానిక ప్రజల, నాయకులతో ర్యాలీ చేపట్టారు. మరుగుదొడ్లు వినియోగంపై ఉపయోగాలు, అరుబయలు మలవిసర్జనపై అనర్దాలు గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.  కార్యక్రమంలో వైసీపీ నాయకులు, సతీష్‌రెడ్డి, భక్తవత్సలరెడ్డి, నిరంజన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-20T02:54:02+05:30 IST