వైభవంగా తులసీ దామోదర కల్యాణం

ABN , First Publish Date - 2020-12-07T04:20:37+05:30 IST

పట్టణంలోని స్వర్ణముఖినది తీరాన ఉన్న శ్రీ జ్ఞాన ప్రసూనాంబ నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం వైభవంగా తులసీ దామోదరస్వామి కల్యాణం జరిగింది.

వైభవంగా తులసీ దామోదర కల్యాణం
తులసీ దామోదర స్వామికి కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

నాయుడుపేట టౌన్‌, డిసెంబరు 6 : పట్టణంలోని స్వర్ణముఖినది తీరాన ఉన్న శ్రీ జ్ఞాన ప్రసూనాంబ నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం వైభవంగా తులసీ దామోదరస్వామి కల్యాణం జరిగింది. ఆలయ ప్రాంగణంలోని కల్యాణ మండపంలో తులసీ దామోదర స్వామి వార్లను ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. అనంతరం కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తీకమాస వనభోజనాలను నిర్వహించారు. ఉభయ దాతలుగా సుధాకర్‌రాజు-శ్రీదేవి దంపతులు వ్యవహరించారు. కార్యక్రమంలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ ధర్మకర్త చదలవాడ మోహన్‌కృష్ణ శర్మ, టీడీపీ నాయకులు, నుడా మాజీ డైరెక్టర్‌ గూడూరు రఘునాథరెడ్డి, వైసీపీ నాయకులు కామిరెడ్డి రాజారెడ్డి, తెలుగుయువత జిల్లా కార్యదర్శి అవధానం సుధీర్‌, అర్చకులు గణే్‌షస్వామి,  బాలాజీస్వామి, భక్తులు పాల్గొన్నారు.

Read more