దళిత ద్రోహి సీఎం జగన్

ABN , First Publish Date - 2020-12-31T03:12:47+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దళిత ద్రోహి అని మాల మహాసేన జాతీయ అధ్యక్షుడు ఆలగ రవికుమార్‌ పేర్కొన్నారు.

దళిత ద్రోహి సీఎం జగన్
మాట్లాడుతున్న ఆలగ రవికుమార్‌

మాల మహాసేన జాతీయ అధ్యక్షుడు రవికుమార్‌

ఉదయగిరి రూరల్‌, డిసెంబరు 30: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దళిత ద్రోహి అని మాల మహాసేన జాతీయ అధ్యక్షుడు ఆలగ రవికుమార్‌ పేర్కొన్నారు. బుధవారం స్థానిక తహసీల్దారు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల రాజధాని ప్రాంతంలోని వెలగపూడిలో రెండు వర్గాల మధ్య చోటుచేసుకొన్న ఘర్షణలో మొండెం మరియమ్మ మృతి చెందడం బాధాకరమన్నారు. ఈ ఘర్షణకు కారణమైన ఎంపీ నందిగాం సురే్‌షను వెంటనే పార్టీని నుంచి సస్పెండ్‌ చేసి ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. దళితుల ఓట్లతో గద్దెనెక్కిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో వారిపై దాడులు చేస్తుంటే మౌనం వహించడం దారుణమన్నారు. అనంతపురంలో స్నేహలత అనే యువతిని దారుణంగా హత్య చేసినా వారి కుటుంబాన్ని పరామర్శించే వారు కరువయ్యారన్నారు. ఎంపీ నందిగాం సురేష్‌ పేరును ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేస్తామని హోంమంత్రి మాట ఇచ్చినా కార్యరూపం దాల్చలేదన్నారు. సురేష్‌ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడంతోపాటు మరియమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. లేకుంటే మాల మహాసేన ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాల మహాసేన సౌత్‌ ఇండియా అధ్యక్షుడు టీవీ రమణరావు, జిల్లా అధ్యక్షుడు హర్షవర్ధన్‌, ఉపాధ్యక్షుడు బొగ్గవరపు రత్నం, కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరమణ, కర్నూల్‌ జిల్లా అధ్యక్షుడు నర్రా మహేంద్ర, ఉదయగిరి నియోజకవర్గ నాయకులు నాగార్జున, లీలావతి, చంద్రప్ప తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-31T03:12:47+05:30 IST