వైసీపీలో ఇమడలేకనే మళ్లీ టీడీపీలో చేరా

ABN , First Publish Date - 2020-12-06T02:50:20+05:30 IST

వైసీపీలో ఇమడలేకనే మళ్లీ టీడీపీలో చేరానని, నందమూరి వంశ అభిమానిగా విద్యార్థి దశ నుంచి టీడీపీలో పనిచేసి కొన్ని అనివార్యకారణాల వలన మధ్యలో పార్టీలు మారానని సోమశిల ప్రాజెక్ట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ కండ్లగుంట మధుబాబు నాయుడు స్పష్టం చేశారు.

వైసీపీలో ఇమడలేకనే మళ్లీ టీడీపీలో చేరా
మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

కండ్లగుంట మధుబాబు నాయుడు

కావలి, డిసెంబరు 5: వైసీపీలో ఇమడలేకనే మళ్లీ టీడీపీలో చేరానని, నందమూరి వంశ అభిమానిగా విద్యార్థి దశ నుంచి టీడీపీలో పనిచేసి కొన్ని అనివార్యకారణాల వలన మధ్యలో పార్టీలు మారానని సోమశిల ప్రాజెక్ట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ కండ్లగుంట మధుబాబు నాయుడు స్పష్టం చేశారు. స్థానిక జర్నలి్‌స్టక్లబ్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్థానిక నాయకత్వంతో సంబంధం లేకుండా ప్రస్తుతం కష్టకాలంలో ఉన్న మాతృసంస్థ టీడీపీని కాపాడుకునేందుకు పని చేస్తానన్నారు. పదవులు ఆశించి పార్టీలోకి రాలేదని, తనకు ఏ బాధ్యతలు అప్పగించినా పనిచేస్తానని చెప్పారు. ఎమ్మెల్యే ప్రతా్‌పకుమార్‌ రెడ్డి పిలుపు మేరకు వైసీపీలో చేరానని, వైసీపీ నేతలు చేస్తున్న పాపాలను మూటకట్టులేక మదనపడుతున్న సమయంలో తాను అభిమానించే ఎన్టీఆర్‌ విగ్రహాన్ని వైసీపీ నాయకులు కూల్చి వేయటంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ పిలుపు మేరకు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ప్రోత్సాహంతో తిరిగి తన మాతృసంస్థ  టీడీపీలో చేరానని చెప్పారు. రాష్ట్రంలో పెచ్చుమీరిన వైసీపీ నేతల అరాచకాలకు అంతం పలికే రోజులు దగ్గర పడుతున్నాయని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మన్నవ రవిచంద్ర చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ గ్రంధి యానాదిశెట్టి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మొగిలి కల్లయ్య, ఏరియావైద్యశాల అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్‌ గుత్తికొండ కిషోర్‌బాబు, నెల్లూరు పార్లమెంట్‌ ఎస్సీసెల్‌ అధ్యక్షుడు కాకి ప్రసాద్‌, టీడీపీ నేతలు చవల రామకృష్ణ, మల్లికార్జున రెడ్డి, పోతుగంటి శ్రీకాంత్‌, గొట్టిపాటి రాము పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T02:50:20+05:30 IST