రూ.10లక్షల విలువైన నిషేధిత గుట్కాలు పట్టివేత

ABN , First Publish Date - 2020-03-24T07:28:28+05:30 IST

సుమారు రూ.10లక్షల విలువ చేసే అక్రమ నిషేధిత గుట్కాలను తరలిస్తున్న మాఫియాను పొదలకూరు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి సోమవారం

రూ.10లక్షల విలువైన నిషేధిత గుట్కాలు పట్టివేత

పొదలకూరు, మార్చి 23 : సుమారు రూ.10లక్షల విలువ చేసే అక్రమ నిషేధిత గుట్కాలను తరలిస్తున్న మాఫియాను పొదలకూరు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి సోమవారం సాయంత్రం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆత్మకూరు డీఎస్పీ మక్బుల్‌ విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల మేరకు పొదలకూరు వినాయకమాన్యంకు చెందిన షేక్‌.సులేమాన్‌, ఆత్మకూరుకు చెందిన చిలకచర్ల గురుబ్రహ్మం, అనంతసాగరం వెంగంపల్లి గ్రామానికి చెందిన కాకూరు వెంకటేశ్వర్లురెడ్డి కలిసి బెంగుళూరు నుంచి నిషేధిత గుట్కాలను తక్కువ ధరకు కొని జిల్లాలోని పలు షాపులకు అధిక ధరలకు అమ్ముతూ గుట్కా మాఫియా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 


ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున పొదలకూరు నుంచి నెల్లూరుకు కారులో రూ.10లక్షల విలువ చేసే గుట్కాలను తరలిస్తూ ఉండగా రెక్కీ నిర్వహించిన పోలీసులు గుట్కాలతో వెళ్లే కారును వెంబడించి పట్టుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా కారు డిక్కీలో 9 విమల్‌ గుట్కాలు, 12హాన్స్‌ బస్తాలు ఉన్నట్లు గుర్తించారు. అలాగే పట్టేలు కాలువ పక్కనే అటవీ పొదలలో గుట్కాలు తయారు చేసే కంట్రీమిషన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటి విలువ సుమారు రూ.10లక్షలు ఉంటుందని డీఎస్పీ వివరించారు. గుట్కా మాఫియా గుట్టు రట్ట చేయడంలో కీలక పాత్ర వహించిన అధికారులను, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. 

Read more