కావలిలో లాక్‌డౌన్‌ పొడిగింపు

ABN , First Publish Date - 2020-08-16T10:29:34+05:30 IST

కరోనా కేసుల పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను కొన్ని సడలింపులతో మరో రెండు వారాలు పొడిగించారు. కావలి ఆర్డీవో కార్యాలయంలో శనివా

కావలిలో లాక్‌డౌన్‌ పొడిగింపు

కావలి, ఆగస్టు 15 : కరోనా కేసుల పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను కొన్ని సడలింపులతో మరో రెండు వారాలు పొడిగించారు. కావలి ఆర్డీవో కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే ప్రతా్‌పకుమార్‌ రెడ్డి, ఆర్డీవో ఎం.దాసు, డీఎస్పీ డీ.ప్రసాద్‌, మున్సిపల్‌ కమిషనర్‌ బీ.శివారెడ్డి సమావేశమై తీసుకున్న నిర్ణయాన్ని విలేకరులకు వివరించారు. ప్రస్తుతం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు దుకాణాలకు అవకాశం ఇచ్చి పూర్తి లాక్‌డౌన్‌ను కొనసాగిస్తుండగా ఈ నెల 17వ తేదీ నుంచి రెండు వారాలపాటు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు దుకాణాలు తెరుచుకునే విధంగా నిర్ణయం తీసుకున్నారు.

Updated Date - 2020-08-16T10:29:34+05:30 IST