చిరు వ్యాపారులకు రుణాలు

ABN , First Publish Date - 2020-11-26T04:21:19+05:30 IST

స్థానిక స్త్రీశక్తి భవనంలో బుధవారం జగనన్న తోడు పథకం పథకం కింద లబ్ధిదారులైన చిరువ్యాపారులకు రుణ మంజూరు పత్రా

చిరు వ్యాపారులకు రుణాలు
మంజూరు పత్రాలు అందజేస్తున్న ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి

ఉదయగిరి రూరల్‌, నవంబరు 25: స్థానిక స్త్రీశక్తి భవనంలో బుధవారం  జగనన్న తోడు పథకం పథకం కింద లబ్ధిదారులైన చిరువ్యాపారులకు రుణ మంజూరు పత్రాలు అందజేశారు. మండలంలో ఈ పథకానికి 326 మంది చిరు వ్యాపారులు దరఖాస్తు చేసుకోగా బ్యాంకు 177 మందికి మంజూరు చేసింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు చేజర్ల సుబ్బారెడ్డి, మండల ప్రత్యేకాధికారి నారాయణ, ఎంపీడీవో వీరాస్వామి, తహసీల్దారు హరనాథ్‌, నాయకులు ఎస్థాన్‌, జీ.ఓబులరెడ్డి, రియాజ్‌, గౌస్‌మొహిద్దీన్‌, ముర్తుజా, సలీం, ఎస్థాన్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read more