ప్రధానోపాధ్యాయుడిపై అధికారుల విచారణ

ABN , First Publish Date - 2020-12-16T03:43:27+05:30 IST

మండలంలోని లింగంనేనిపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎన్‌.వేణుగోపాల్‌ విధుల్లో అలసత్వం వహిస్తుండడంతో ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు.

ప్రధానోపాధ్యాయుడిపై అధికారుల విచారణ
విద్యార్థుల తల్లిదండ్రులను విచారిస్తున్న అధికారులు

ఉదయగిరి రూరల్‌, డిసెంబరు 15: మండలంలోని లింగంనేనిపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎన్‌.వేణుగోపాల్‌ విధుల్లో అలసత్వం వహిస్తుండడంతో ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. అందులో భాగంగా మంగళవారం దుత్తలూరు ఎంఈవో షేక్‌ అల్లాబక్షు, బిజ్జంపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం వెంకటేశ్వర్లు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. పాఠశాల పేరెంట్స్‌ కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులను ప్రధానోపాధ్యాయుడి తీరుపై విచారించి నివేదికలు తయారు చేశారు. విచారణ అంశాలను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో షేక్‌ మస్తాన్‌వలి, ఉపాధ్యాయుడు సుబ్బారెడ్డి, సీఆర్పీ సిద్ధయ్య, గ్రామస్థులు పాల్గొన్నారు.

Read more