గ్రంథాలయ భవన నిర్మాణం జరిగేనా?

ABN , First Publish Date - 2020-11-22T04:32:08+05:30 IST

గ్రంథాలయాలు దయనీయ పరిస్థితిలో ఉన్నాయి. గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహించుకుంటున్నా దశాబ్దాల తరబడి కొన్ని గ్రంథాలయాలు చాలీచాలని అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఇందుకు ఆత్మకూరు గ్రంథాలయ

గ్రంథాలయ భవన నిర్మాణం జరిగేనా?

కొలిక్కిరాని స్థల వివాదం

ఆత్మకూరు, నవంబరు 21 : గ్రంథాలయాలు దయనీయ పరిస్థితిలో ఉన్నాయి. గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహించుకుంటున్నా దశాబ్దాల తరబడి కొన్ని గ్రంథాలయాలు చాలీచాలని అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి.  ఇందుకు ఆత్మకూరు గ్రంథాలయమే ప్రత్యక్ష నిదర్శనం.  గ్రంథాలయ భవన నిర్మాణానికి స్థలం కేటాయించేందుకు 2018 నవంబరులో మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో తీర్మానం జరిగింది. స్థలం కేటాయిస్తే త్వరలో భవన నిర్మాణ పనులు మొదలయ్యే అవకాశాలుంటాయని ఆశపడ్డారు. భవన నిర్మాణం పూర్తి అయితే దశాబ్ధాల తరబడి అద్దెభవనంలో కునారిల్లుతున్న ఆత్మకూరు గ్రంథాలయానికి మహర్దశ పట్టేది.  గ్రంథాలయంలో 1800 మంది సభ్యులు ఉండగా 16,173 వివిధ రకాల గ్రంథాలు ఉన్నాయి. ఈ క్రమంలో సరైన వసతులు లేక పాఠకులు అవస్థలు పడుతున్నారు. సొంతభవనం అందు బాటులోకి వస్తే పాఠకులకు మెరుగైన వసతులు చేకూరుతాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి గ్రంఽథాలయ శాశ్వత భవన నిర్మాణానికి స్థలం, నిధులు మంజూరు చేయించి భవన నిర్మాణం చేపట్టాలని పాఠకులు కోరుతున్నారు. 


Read more