లీగల్‌ ఎయిడ్‌ క్లీనిక్‌ సేవలు సద్వినియోగం చేసుకోండి

ABN , First Publish Date - 2020-12-20T03:16:49+05:30 IST

లీగల్‌ ఎయిడ్‌ క్లీనిక్‌ సేవలు సద్వినియోగం చేసుకోవాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి పీ పాండురంగారెడ్డి పేర్కొన్నారు.

లీగల్‌ ఎయిడ్‌ క్లీనిక్‌ సేవలు సద్వినియోగం చేసుకోండి

న్యాయమూర్తి పాండురంగారెడ్డి

కావలిటౌన్‌, డిసెంబరు 19: లీగల్‌ ఎయిడ్‌ క్లీనిక్‌ సేవలు సద్వినియోగం చేసుకోవాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి పీ పాండురంగారెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానికి సబ్‌జైల్‌లో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో లీగల్‌ ఎయిడ్‌ క్లీనిక్‌ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. జడ్జి మాట్లాడుతూ రిమాండ్‌ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం, సలహాలు అందించేందుకు ఈ క్లినిక్‌ను ప్రారంభించామాన్నరు. ఈ కేంద్రానికి ఒక న్యాయవాది, ఒక పారా లీగల్‌ వలంటీర్‌ను నియమించామని, వారు వారానికి రెండు సార్లు జైలును సందర్శించి అవసరమైన ఖైదీలకు న్యాయ సలహాలు అందిస్తార్నారు. ఖైదీలు నేర ప్రవృత్తి విడనాడి సత్ప్రవర్తన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జైల్‌ సూపరింటిండెంట్‌ మధుబాబు, బార్‌ అసోసియోషన్‌ అధ్యక్షుడు మాల్యాద్రి, లోక్‌ అదాలత్‌ సభ్యులు కెనడి, శ్రీదేవి, ఎం మాలకొండారెడ్డి, న్యాయవాదులు ఐ సాయప్రాద్‌, ఎలీషా పాల్గొన్నారు.

Updated Date - 2020-12-20T03:16:49+05:30 IST