డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ భూ దందాపై ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-11-14T02:49:23+05:30 IST

దుత్తలూరు మండలం కమ్మవారిపల్లి సొసైటీ అధ్యక్షుడు, డీసీఎంఎస్‌ జిల్లా డైరెక్టర్‌ చేజర్ల చలమారెడ్డి భూ ఆక్రమణలపై మండలంలోనే వేరుకోల్లు గ్రామానికి చెందిన డి.పేరయ్య ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దానిని స్థానిక అధికారులు, కావలి ఆర్డీవో రాష్ట్ర

డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ భూ దందాపై ఫిర్యాదు

ఉదయగిరి రూరల్‌, నవంబరు 13: దుత్తలూరు మండలం కమ్మవారిపల్లి సొసైటీ అధ్యక్షుడు, డీసీఎంఎస్‌ జిల్లా డైరెక్టర్‌ చేజర్ల చలమారెడ్డి భూ ఆక్రమణలపై మండలంలోనే వేరుకోల్లు గ్రామానికి చెందిన డి.పేరయ్య ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దానిని స్థానిక అధికారులు, కావలి ఆర్డీవో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించారు. చలమారెడ్డి వేరుకొల్లు గ్రామంలో పాత చెరువు ఆక్రమించుకుని జామాయిల్‌ సాగు చేస్తున్నారని, వివిధ సర్వే నెంబర్లలోని మేత, డొంక, అనాధీన భూములను ఆక్రమించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మండల అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దుత్తలూరు తహసీల్దారు చంద్రశేఖర్‌ను వివరణ కోరగా ఫిర్యాదు నివేదికలు అందాయని విచారణ చేస్తామని చెప్పారు.

 

Updated Date - 2020-11-14T02:49:23+05:30 IST