ఆధునిక సాంకేతికతను రైతులకు అందించడమే ధ్యేయం

ABN , First Publish Date - 2020-12-08T01:31:56+05:30 IST

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించడమే ధ్యేయంగా పనిచేస్తానని నెల్లూరులోని కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ వీ సుమతి పేర్కొన్నారు.

ఆధునిక సాంకేతికతను రైతులకు అందించడమే ధ్యేయం
డాక్టర్‌ సుమతి

కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ సుమతి


నెల్లూరు(వ్యవసాయం), డిసెంబరు 7 : ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించడమే ధ్యేయంగా పనిచేస్తానని నెల్లూరులోని కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ వీ సుమతి పేర్కొన్నారు. తిరుపతి వ్యవసాయ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆమె కేవీకేకు బదిలీ అయ్యారు. దీంతో సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఆ స్థానంలో పనిచేసిన డాక్టర్‌ జీ లలితా శివజ్యోతి కావలి పరిశోధనా స్థానానికి బదిలీ అయ్యారు. సుమతి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సిబ్బందితో సమావేశమయ్యారు. రైతులకు ఆధునిక సాంకేతికతను అందించే దిశగా విజ్ఞాన కేంద్రంలోని బోధన, బోధనేతర సిబ్బంది సహకరించాలని కోరారు. కేవీకే కార్యక్రమాలపై చర్చించారు. 

Updated Date - 2020-12-08T01:31:56+05:30 IST