-
-
Home » Andhra Pradesh » Nellore » Krishna Patnam port workers agitation
-
కృష్ణపట్నం పోర్టు కార్మికుల ధర్నా
ABN , First Publish Date - 2020-12-10T05:30:00+05:30 IST
కృష్ణపట్నం పోర్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లను పోర్టు యాజమాన్యం నెరవేర్చాలని ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగరావు డిమాండ్ చేశారు.

ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం, నర్సింగరావు
కలెక్టరేట్ ఎదుట కార్మికుల ధర్నా
నెల్లూరు(వైద్యం), డిసెంబరు 10 : కృష్ణపట్నం పోర్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లను పోర్టు యాజమాన్యం నెరవేర్చాలని ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగరావు డిమాండ్ చేశారు. గురువారం కలెక్టరేట్ ఎదుట కార్మికులు చేపట్టిన 48 గంటల సామూహిక ధర్నాలో వారు పాల్గొని ప్రసంగించారు. పోర్టు యాజమాన్యం 13 ఏళ్లుగా కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని విమర్శించారు. 12 గంటలపాటు పనులు చేయించుకోవటం, పండుగలకు సెలవులు ఇవ్వక పోవటం, గ్రాట్యుటీ, ఓవర్‌టైం కరువుభత్యం చెల్లించక పోవటం సరికాదన్నారు. అంతకుముందు కార్మికులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వరప్రసాద్, కటారి అజయ్, మోహన్‌రావు, ఇండస్ట్రీస్ కారిడార్ మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు, ప్రభాకర్, ఏఐటీయూసీ నేతలు అంజనేయులు, రమణయ్య, పులిగండ్ల శ్రీరాములు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.