బావిలో దూకి వృద్ధురాలి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-12-16T03:51:51+05:30 IST

కుటుంబ కలహాలతో మనస్థాపం చెందిన పిట్టా వెంకమ్మ (81) అనే వృద్ధురాలు మంగళవారం పాతూరు జొన్నాయగుంటలోని హైమానగర్‌లో వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

బావిలో దూకి వృద్ధురాలి ఆత్మహత్య

కావలిరూరల్‌, డిసెంబరు 15: కుటుంబ కలహాలతో మనస్థాపం చెందిన పిట్టా వెంకమ్మ (81) అనే వృద్ధురాలు మంగళవారం పాతూరు జొన్నాయగుంటలోని హైమానగర్‌లో వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం మేరకు.. జలదంకి మండలం రామవరప్పాడుకు చెందిన వెంకమ్మకు ఐదుగురు సంతానం ఉన్నా గ్రామంలో ఒంటరిగానే నివశిస్తుంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఆమె ఇంట్లోకి నీరు చేరిందని గ్రామస్థులు ఆమె కుమారుడు మాల్యాద్రికి చెప్పటంతో ఆయన వారం క్రితం తన తల్లిని కావలిలోని తన ఇంటికి తీసుకువచ్చాడు. మంగళవారం తల్లిని చూడడానికి వచ్చిన ఆమె కుమార్తెకు కుమారుడికి గొడవ జరగటంతో మనస్థాపం చెందిన వెంకమ్మ చేతికర్ర సహాయంతో హడావుడిగా ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వచ్చేలోపే కుమారుడి ఇంటికి సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి మృతి చెందింది. సమాచారం అందుకున్న 1వ పట్టణ సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ కొండయ్య సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బావిలో నుంచి వెలికితీయించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2020-12-16T03:51:51+05:30 IST