బలిజ-కాపు రిజర్వేషన్ల వ్యతిరేకి వైసీపీకి గుణపాఠం చెప్పాలి

ABN , First Publish Date - 2020-12-30T03:58:19+05:30 IST

బలిజ-కాపు రిజర్వేషన్ల వ్యతిరేకైన వైసీపీకి రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని బలిజ-కాపు సంక్షేమ సంఘం కావలి శాఖ అధ్యక్షుడు తోట వెంకటశేషయ్య పిలుపునిచ్చారు.

బలిజ-కాపు రిజర్వేషన్ల వ్యతిరేకి వైసీపీకి గుణపాఠం చెప్పాలి
క్యాలెండర్‌ ఆవిష్కరిస్తున్న బలిజ-కాపు సంఘం నేతలు

కావలి, డిసెంబరు 29: బలిజ-కాపు రిజర్వేషన్ల వ్యతిరేకైన వైసీపీకి రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని బలిజ-కాపు సంక్షేమ సంఘం కావలి శాఖ అధ్యక్షుడు తోట వెంకటశేషయ్య పిలుపునిచ్చారు. ఆ సంఘ కార్యాలయంలో మంగళవారం సంఘం అభివృద్ధి కార్యక్రమాలతో కూడిన 2021 సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. గత టీడీపీ ప్రభుత్వం బలిజ-కాపు బిడ్డల అభ్యున్నతికి కాపు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి 50 శాతం సబ్సిడీతో ఇచ్చే రుణాలకు రూ.100 కోట్లు ఇచ్చిందని చెప్పారు. 2019 ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్‌రెడ్డి బలిజ, కాపులు వైసీపీకి ఓట్లు వేసి గెలిపిస్తే ఏడాదికి 2వేల కోట్లు ఇస్తానని వాగ్దానం చేసి నట్టేట ముంచారన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు అలహరి నాగేశ్వరరావు, పీ. శ్రీనివాసులు, మామిడాల మధు, పీ. వెంకటేశ్వర్లు, నాగిశెట్టి శ్రీనివాసులు, యాదాల హరిబాబు, పులిగండ్ల సుబ్బారావు, రామిశెట్టి పెంచలయ్య పాల్గొన్నారు.

Updated Date - 2020-12-30T03:58:19+05:30 IST