జ్యోతిషశాస్త్రంలో జీవీబీకి అవార్డు

ABN , First Publish Date - 2020-12-31T03:56:47+05:30 IST

జ్యోతిష శాస్త్రంలో జాతీయ స్థాయి ఎక్సలెన్సీ అవార్డును ముత్తుకూరుకు చెందిన జ్యోతిష శిరోమణి డాక్టర్‌ జీవీబీ మురళీకృష్ణ అందుకున్నారు. బుధవారం అవార్డు గ్రహీత మురళీకృష్ణను ఉపాధ్యాయులు, నా

జ్యోతిషశాస్త్రంలో జీవీబీకి అవార్డు
అవార్డు అందుకుంటున్న మురళీకృష్ణ

ముత్తుకూరు, డిసెంబరు30: జ్యోతిష శాస్త్రంలో జాతీయ స్థాయి ఎక్సలెన్సీ అవార్డును ముత్తుకూరుకు చెందిన జ్యోతిష శిరోమణి డాక్టర్‌ జీవీబీ మురళీకృష్ణ అందుకున్నారు. బుధవారం అవార్డు గ్రహీత మురళీకృష్ణను ఉపాధ్యాయులు, నాయకులు అభినందించారు. హైదరాబాదులో శ్రీవిశ్వేశ్వర ఆస్ట్రో వాస్తు స్టడీ సంస్థ, పరాశర ఆకాడమీ ఆఫ్‌ ఆస్ట్రలాజికల్‌ సైన్స్‌ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ ఆస్ట్రలాజికల్‌ సెమినార్‌లో శృంగేరి పీఠం ఆస్థాన పండితులు శంకరమంచి రామకృష్ణ శాస్త్రి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్‌ నాగులపల్లి మహేష్‌చందర్‌, తెలంగాణ విద్వత్‌ సభ అధ్యక్షుడు దర్శనం శర్మ, బ్రహ్మశ్రీ చంద్రశేఖర్‌శర్మ, జ్యోతిష ఫ్రొఫెసర్‌ సీఎస్‌ రావు, జ్యోతిష ప్రముఖులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-31T03:56:47+05:30 IST