వలస కూలీలకు జడ్జి పరామర్శ
ABN , First Publish Date - 2020-05-24T09:22:49+05:30 IST
నెల్లూరులోని ఎన్టీఆర్ నగర్ వద్ద రెడ్‌క్రాస్ శిబిరంలో ఉన్న వలస కూలీలను జిల్లా జడ్జి వెంకటకృష్ణయ్య పరామర్శించారు.

నెల్లూరు(వైద్యం) మే 23 : నెల్లూరులోని ఎన్టీఆర్ నగర్ వద్ద రెడ్‌క్రాస్ శిబిరంలో ఉన్న వలస కూలీలను జిల్లా జడ్జి వెంకటకృష్ణయ్య పరామర్శించారు. ఒడిసా, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాలకు వెళుతున్న వారి వెతలను పరిశీలించి వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ప్రయాణాలలో పిల్లలు అనారోగ్యానికి గురికాకుండా చూసుకోవాలని కుటుంబ సభ్యులకు సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే వాహనాల్లో స్వస్థలాలకు చేరుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యా సేవాధికారసంస్థ కార్యదర్శి పీజే సుధా, జేసీ 3 కమలకుమారి పాల్గొన్నారు.