-
-
Home » Andhra Pradesh » Nellore » journlists kosam website
-
పాత్రికేయులకోసం వెబ్‌సైట్
ABN , First Publish Date - 2020-12-29T05:07:00+05:30 IST
పాత్రికేయులకు ఉపయోగపడే విధంగా త్వరలో ప్రెస్ అకాడమీ వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ తెలిపారు.

ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనాథ్
నెల్లూరు(హరనాథపురం), డిసెంబరు 28 : పాత్రికేయులకు ఉపయోగపడే విధంగా త్వరలో ప్రెస్ అకాడమీ వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ తెలిపారు. ఆయన సోమవారం తిరుపతికి వెళుతూ మార్గమధ్యంలో నెల్లూరు ఆర్‌అండ్‌బీ అతిఽథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తుందని, అందులో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను పొందుపరుస్తారని చెప్పారు. వృత్తిపరంగా జర్నలిస్టులు ఆ వెబ్‌సైట్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జర్నలిజంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేలా ప్రెస్ అకాడమీ తరపున ఆన్‌లైన్‌లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రెండో విడతలో ప్రత్యక్షంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. ప్రెస్ అకాడమీ తరపున ముద్రించిన 12 పుస్తకాలను త్వరలో పాత్రికేయులకు పంపిణీ చేస్తామన్నారు.