జర్నలిస్టులకు రూ.50 లక్షల బీమా ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-04-26T10:35:12+05:30 IST

కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకూ రూ.50 లక్షల బీమా సదుపాయాన్ని..

జర్నలిస్టులకు రూ.50 లక్షల బీమా ఇవ్వాలి

ఏపీయూడబ్ల్యూజే నాయకులు వినతి


నెల్లూరు (సాంస్కృతికం), ఏప్రిల్‌ 25 : కరోనా విపత్కర పరిస్థితుల్లో  ప్రాణాలను  సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకూ రూ.50 లక్షల బీమా సదుపాయాన్ని కల్పించాలని ఏపీయూడబ్ల్యూజే నాయకులు రాష్ట్ర మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్‌యాదవ్‌లను కోరారు. శనివారం మంత్రులకు వారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్చి 31తో ముగిసిన జర్నలిస్టు హెల్త్‌కార్డులు 20202-21 సంవత్సరానికి సంబంధించి అంతరాయం లేకుండా కొనసాగించాలని కోరారు. విధుల్లో ఉన్న జర్నలిస్టులకు పీపీఈ కిట్లు, మాస్క్‌లు, శానిటైజర్‌లు ఇవ్వాలన్నారు. జర్నలిస్టులను ఆర్థికంగానూ, ఆరోగ్యపరంగానూ ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్‌, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు వల్లూరు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 


Updated Date - 2020-04-26T10:35:12+05:30 IST